: ప్రశాంతంగా కొనసాగుతున్న శోభాయాత్ర
హైదరాబాద్ నగరంలో గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. గణనాథులను హుస్సేన్ సాగర్ కు తరలిస్తున్నారు. గణనాథులను రంగు రంగుల పూలు, విద్యుత్ బల్బులతో అలంకరించి వాహనాల్లో ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఆటపాటలతో భక్తులు సందడి చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు శోభాయాత్రకు తరలి వస్తున్నారు. ఆటలు, పాటలతో యువత చాలా ఉత్సాహంగా నిమజ్జనోత్సవాలను నిర్వహిస్తున్నారు. వివిధ భంగిమల్లో ఉన్న గణనాథుని విగ్రహ ప్రతిమలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. వినాయక నిమజ్జన దృశ్యాలను భక్తులు ఆనంద పారవశ్యంతో తిలకిస్తున్నారు.