: ఏరియల్ సర్వే నిర్వహించిన హోం మంత్రి


హైదరాబాద్ నగరంలో జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి విహంగ వీక్షణం చేశారు. డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన హెలికాఫ్టర్ ద్వారా నగరంలోని నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. హుస్సేన్ సాగర్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతున్న తీరును సుమారు 45 నిమిషాల పాటు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ జంట నగరాల్లో గణేశ్ నిమజ్జనోత్సవం భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోందని అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి పోతున్నాయన్నారు. రేపు ఉదయం 10 గంటల కల్లా నిమజ్జనోత్సవం పూర్తయ్యే అవకాశం ఉందని నాయిని వెల్లడించారు.

  • Loading...

More Telugu News