: రాహుల్ గాంధీ రాజకీయ కార్యదర్శిగా మాజీ ఐఏఎస్ అధికారి?
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజును నియమిస్తారని సమాచారం. దీనిపై పార్టీ వర్గాల్లో ప్రచారం బాగానే జరుగుతోంది. గతంలో పేద, వెనుకబడిన వర్గాల సంక్షేమ పథకాల రచనలో రాజు కీలకపాత్ర పోషించారు. రాహుల్ కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్న ఆయన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా రాహుల్ ముఖ్య ప్రసంగాల కూర్పు, పార్టీ విధానాల రూపకల్పన విషయంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల పాత్ర మెరుగు పరిచేందుకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రాజు పర్యటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐసీసీ కార్యవర్గాన్ని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేయనుంది.