: బడంగ్ పేట్ గణేష్ లడ్డూ ధర 6.5 లక్షలు!
బాలాపూర్ పక్కనే ఉన్న బడంగ్ పేట్ గణేష్ లడ్డూ వేలం పూర్తయింది. బాలాపూర్ లడ్డు రూ.10.32 లక్షలు పలుకగా బడంగ్ పేట్ గణేష్ ని చేతిలో పదిరోజుల పాటు ఉన్న లడ్డూ రూ.6.5 లక్షలు పలికింది. బడంగ్ పేట్ లడ్డూకు పోటాపోటీగా జరిగిన వేలంలో మాజీ సర్పంచ్ నడికుడి యాదగిరి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ గణేష్ లడ్డూ తనకు దక్కడం చాలా ఆనందంగా ఉందని, స్వామిదయ ప్రజలందరిపై ఉండాలని వేడుకుంటున్నానని అన్నారు.