: ఐటెమ్ సాంగ్స్ హోరుతో రాత్రి నిద్రపట్టలేదు: రేణు దేశాయి


‘వినాయక నిమజ్జనం సందర్భంగా ఐటమ్ సాంగ్స్ తో జరిగిన హంగామా అంతా ఇంతా కాదు. లౌడ్ స్పీకర్లతో హోరెత్తించారు. దీంతో నిన్న రాత్రంతా మా కూతురు ఆద్యకు నిద్రపట్టలేదు’ అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి ట్విట్టర్ లో పేర్కొంది. మన భక్తిని నిరూపించుకోవాలంటే నిమజ్జన ఉత్సవాల్లో ఐటెమ్ సాంగ్స్ అవసరమా? అంటూ ఆమె ప్రశ్నించారు. భక్తికి, ఐటెమ్ సాంగ్స్ కి ఏమైనా సంబంధముందా? అంటూ రేణుదేశాయి కామెంట్ చేశారు. రేణు దేశాయి తమ పిల్లలతో కలిసి ప్రస్తుతం పూణెలో ఉంటున్నారు.

  • Loading...

More Telugu News