: అప్పులు తీర్చాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చే వ్యాపారులపై కఠిన చర్యలు: ప్రత్తిపాటి
రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం అప్పులిచ్చి, ఆపై వాటిని తీర్చమని ఒత్తిడి చేసే ప్రైవేటు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. అప్పులు తీర్చలేకపోయిన రైతులపై వ్యాపారులు ఒత్తిడి తేవద్దని సూచించారు. ఈ ఉదయం చిలకలూరిపేట పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ఆయన అన్నారు. రుణమాఫీని పక్కాగా అమలు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని అన్నారు.