: ప్రాణాలు తీసిన సైనికుడి సరదా!


ఓ నది వద్దకు వెళ్లి, సరదాగా బ్రిడ్జిపై నుంచి డైవింగ్ చేసిన సైనికుడు ప్రమాదవశాత్తూ నదిలోని రాళ్లను తాకి ప్రాణాలు కోల్పోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పాతపట్నం బ్రాహ్మణ వీధికి చెందిన మల్లేడి మధుబాబు (25) భారత సైన్యంలో పనిచేస్తున్నాడు. జమ్మూకాశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ, ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడి మహేంద్ర తనయ నది వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లి, బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకాడు. తల్లకిందులుగా డైవ్ చేయడంతో నదిలోని రాళ్లకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఉదయం మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుబాబు మృతితో పాతపట్నంలో విషాదఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News