: స్టీవ్ జాబ్స్ ఇండియా పర్యటన రహస్యాన్ని తెలిపిన యాపిల్ చీఫ్ టిమ్ కుక్
మోదీ అమెరికా పర్యటనలో ప్రధాన ఘట్టం మొదలైంది. టెక్ పరిశ్రమలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా ఆయన సమావేశం అవుతున్నారు. తొలి సమావేశంలో భాగంగా యాపిల్ చీఫ్ టిమ్ కుక్ మోదీని కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కుక్ ఓ ఆసక్తికర విషయాన్ని మోదీకి తెలిపారు. తమ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఇండియా పర్యటనల రహస్యాన్ని విప్పారు. భారత్ కు వెళ్లి వస్తే ఎంతో ప్రేరణ పొందవచ్చని, ఆ కారణంతోనే స్టీవ్ ఇండియా పర్యటనలు జరిపేవారని అన్నారు. ఇండియాతో తమకు ఎంతో అనుబంధముందని, భారత్ లోని అపార మార్కెట్ తమ సంస్థకు అత్యంత ప్రధానమని, డిజిటల్ ఇండియా సృష్టికి తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.