: హైదరాబాద్ లో రేపు ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 9 మార్గాల నుంచి హుస్సేన్ సాగర్ కు గణనాథులను తీసుకురావచ్చన్నారు. ఈ మార్గాలను సీనియర్ పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. 23 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు సూచించిన మార్గాల్లోనే విగ్రహాలు తరలించాలని కమిషనర్ సూచించారు. సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ఫ్ లైన్ నంబర్లు 404-27852482, 9490598985లలో సంప్రదించాలని నగర సీపీ చెప్పారు.