: ప్రభుత్వ పనితీరు గురించి ఆర్ఎస్ఎస్ అడగదు: రాజ్ నాథ్ సింగ్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పనితీరుపై ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ప్రశ్నించదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. గుజరాత్ లో పటేల్ పాటీదార్ అనామత్ ఆందోళన్ వెనుక ఆర్ఎస్ఎస్ మాస్టర్ బ్రెయిన్ ఉందని, బీజేపీకి ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టు లాంటిదని అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రిపోర్టులు అడగదని అన్నారు. కుల, మతాల ఆధారంగా అసమానతలు సృష్టించేందుకు ఆర్ఎస్ఎస్ మద్దతివ్వదని ఆయన స్పష్టం చేశారు. తాను, ప్రధాని మోదీ స్వతహాగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలమని ఆయన గుర్తుచేశారు.