: ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి: మోదీ
ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. న్యూయార్క్ లో జరిగిన జీ4 దేశాల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అమలు కావాలని ఆయన అన్నారు. తీవ్రవాదం, పర్యావరణం, కాలుష్యం ప్రపంచానికి సవాళ్లు విసురుతున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచం శాంతికి జీ4 దేశాలు కట్టుబడి ఉన్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలను ఐక్యరాజ్యసమితి కలుపుకుని, పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.