: డాలర్ శేషాద్రికి గుండెపోటు
భక్తులకు సుపరిచితుడైన తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రికి గుండెపోటు వచ్చింది. బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వర్తించిన శేషాద్రికి ఆకస్మిక గుండెపోటు రావడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించి సేవలందించారు. మెరుగైన వైద్యం కోసం అప్పట్లో ఆయనను చెన్నై తరలించారు. కోలుకున్న అనంతరం వెంకటేశ్వరస్వామి దయవల్లే బతికి బట్టకట్టానని, ఈ జీవితం ఆయనకే అంకితమని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.