: సింగపూర్ కి, చంద్రబాబుకి మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాలి: వైఎస్సార్సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, సింగపూర్ ప్రభుత్వానికి మద్య ఉన్న అనుబంధం గురించి బయటపెట్టాలని వైఎస్సార్సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ బాధ్యతలు సింగపూర్ వ్యాపారవేత్తలకు అప్పగించడంతో చంద్రబాబు అసలు నైజం బట్టబయలైందని అన్నారు. ఆయనో గోముఖ వ్యాఘ్రమని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదని ఆయన అడిగారు. రాజధాని నిర్మాణం పనులు ప్రారంభిస్తే సింగపూర్ కంపెనీలు రావన్న భయమా? అని ఆయన ప్రశ్నించారు.