: వెంకయ్య, విజయ్ మాల్యాను పిలుచుకొస్తే రూ.10 లక్షలిస్తా: వాటల్ నాగరాజ్
కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాలను పిలుచుకువస్తే రూ. 10 లక్షలను బహుమానంగా ఇస్తామని వాటల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ ఆఫర్ ఇచ్చారు. వీరిద్దరి వల్ల కర్ణాటకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన మండిపడ్డారు. కళసా-బండూరి తాగునీటి ప్రాజెక్టును నిర్మించే విషయంలో కూడా వెంకయ్యనాయుడు స్పందించడం లేదని అన్నారు. వీరిద్దరిని రాజ్యసభకు పంపించిన కన్నడిగులు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. తమిళనాడు, గోవా ప్రభుత్వాల తీరును కూడా వీరు ప్రశ్నించడం లేదని అన్నారు.