: ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు: కిషన్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల తొలగింపును చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఓట్లను తొలగించిందని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీకి ఆదరణ తగ్గుతోందని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీని 200 డివిజన్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై జీహెచ్ఎంసీలో అధికారం వారికి కట్టబెట్టాలని టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోందని ఆయన ఆరోపించారు.