: నెహ్రూ పేరు తీసేసి బోస్ పేరు పెట్టాలి: సుబ్రహ్మణ్యస్వామి


వివాదాలకు కేంద్ర బిందువైన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రముఖ విశ్వవిద్యాలయం జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీకి పేరు మార్చాలని... సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. నెహ్రూ, బోస్ ల విద్యార్హతల మధ్య ఎంతో తేడా ఉందని ఆయన అన్నారు. రానున్న జనవరిలో జేఎన్ యూ ప్రస్తుత వైస్ ఛాన్సెలర్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో వీసీగా సుబ్రహ్మణ్యస్వామిని నియమించాలని ఎన్డీయే భావిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే సుబ్రహ్మణ్యస్వామితో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News