: ఫేస్ బుక్ ద్వారా ప్రజలతో మమేకం... రికార్డుకెక్కిన ఛత్తీస్ గఢ్ సీఎం
ప్రజల సమస్యలకు సమాధానాలిచ్చేందుకు సామాజిక మాధ్యమమైన ఫేస్ బుక్ ను ఎంచుకున్నారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. ప్రజల సమస్యలను ఆలకించి, ఫేస్ బుక్ ద్వారా స్వయంగా సమాధానమిచ్చిన ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ రికార్డు కెక్కారు. # రమణ కనెక్ట్స్ పేరుతో ప్రతినెలా ఒక ప్రజా సమస్యపై మాట్లాడేందుకు ఆయన నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా శనివారం ఫేస్ బుక్ ద్వారా ఒక గంటపాటు ప్రజలకు సమాధానమిచ్చారు. పలు అంశాలకు సంబంధించి సుమారు 550 పోస్టులు వచ్చాయి. అందులో 75 ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్వయంగా సమాధానమిచ్చారు. నిరుద్యోగం, నైపుణ్యాభివృద్ధి, రాష్ట్ర పథకాలు, డిమాండ్లు, సూచనలు మొదలైన పోస్టులకు ఆయన స్పందించారు.