: ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న చంద్రబాబు: సీపీఎం నేతల ఆరోపణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను విస్మరించాయని సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు జరపని కేంద్ర ప్రభుత్వం భిక్ష వేస్తోందని, ఆ భిక్ష కోసం చంద్రబాబు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారంటూ విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ పై కూడా ఆ నేతలిద్దరూ మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై టీ సర్కార్ కు చీమకుట్టినట్లుగా కూడా లేదని ఆరోపించారు.