: తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది: తుమ్మల


రైతు ఆత్మహత్యల పేరుతో ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని టీఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో, కేంద్ర ప్రభుత్వంపై కూడా తుమ్మల విమర్శలు గుప్పించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని... జాతీయ రహదారుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఏపీకి 750 కిలోమీటర్ల జాతీయ రహదారిని కేటాయించిన కేంద్రం... తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిందని అన్నారు. ఏటూరు నాగారం నుంచి కాళేశ్వరం వరకు జాతీయ రహదారిని మంజూరు చేయాలని కేంద్రానికి ఎన్ని ప్రతిపాదనలు పంపినా, ఇంతవరకు స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News