: ఐక్యరాజ్యసమితిలో భాగమైన మరో హాలీవుడ్ నటి


ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)లో శరాణార్థుల, మహిళల ప్రత్యేక అంబాసిడర్ గా ఏంజెలినా జోలీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ కూడా 'యూఎన్ఓ'లో భాగం కానుంది. యునైటెడ్ నేషన్స్ ఫౌండేషన్ తరపున మహిళల గ్లోబల్ అడ్వొకేట్ గా జెన్నిఫర్ లోపెజ్ నియమితురాలైంది. మహిళల హక్కులు, సమస్యలు ప్రపంచానికి తెలియజేయడమే ఈమె లక్ష్యం. ఈ సందర్భంగా జెన్నిఫర్ మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో భాగం కావడం సంతోషంగా ఉందని చెప్పింది. బాలికా విద్య, మహిళల భద్రత, సాధికారతపై శాయశక్తులా కృషి చేస్తానని జెన్నిఫర్ లోపెజ్ తెలిపింది.

  • Loading...

More Telugu News