: శాన్ ఫ్రాన్సిస్కో, బెంగళూరు మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసుకు ఎయిర్ ఇండియా ప్రయత్నాలు
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, భారత్ లోని బెంగళూరు నగరాల మధ్య లాంగెస్ట్ రూట్ విమాన సర్వీసుకు ఎయిర్ ఇండియా ప్రయత్నిస్తోంది. అంటే ఈ రెండు నగరాల మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసులు నడపాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినట్టు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బెంగళూరు నుంచి దాదాపు 14వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకు నేరుగా విమానంలో వెళ్లాలంటే 17 నుంచి 18 గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. అందుకే ఈ నగరాల మధ్య విమాన సర్వీస్ అమల్లోకి వస్తే ప్రపంచంలోకెల్లా లాంగెస్ట్ రూట్ విమాన సర్వీస్ అవుతుందట. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా లాంగెస్ట్ నాన్ స్టాప్ విమాన సర్వీసును ఖాంటాస్ విమానయాన సంస్థ నిర్వహిస్తోంది. అమెరికాలోని డల్లాస్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ మధ్య (13,730 కిలో మీటర్లు) ఈ విమాన సర్వీస్ నడుస్తోంది.