: గుంటూరులో అక్టోబర్ 7న జగన్ దీక్ష: బొత్స


ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దీక్షకు కొత్త తేదీ ప్రకటించారు. వచ్చే నెల 7న గుంటూరులో జగన్ దీక్ష చేయనున్నట్టు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రత్యేక హోదా విషయంలో తాము పట్టుదలతో ఉన్నామని, భేషజాలకు పోదలుచుకోలేదని అన్నారు. అందుకే తాము దీక్ష తేదీని మార్చుకున్నట్టు చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం తాము నిలబడుతున్నామని పేర్కొన్నారు. గుంటూరు వెళ్లి స్థలాన్ని ఎంపిక చేసుకుంటామని బొత్స చెప్పారు. ఇంతకుముందు కూడా తాము పోలీసులకు చెప్పే దీక్షను ప్రకటించామన్నారు.

  • Loading...

More Telugu News