: బ్రిటీష్ వారిని మించిపోతున్న చంద్రబాబు: వైకాపా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత అమర్నాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో గండికోట ఉత్సవాలు నిర్వహిస్తూ, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించకపోవడం ముఖ్యమంత్రి వైఖరిని తెలియజేస్తోందని ఆయన మండిపడ్డారు. నిరంకుశత్వంలో చంద్రబాబు బ్రిటీష్ వారినే మించిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, కేవలం నిరంకుశత్వమే నడుస్తోందని అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ అధినేత జగన్ ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు.