: భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో సైకో ‘సూదిగాడు’...చితకబాది పోలీసులకు పట్టించిన ప్యాసెంజర్లు
తెలుగు రాష్ట్రాలను గడగడలాంచిన సైకో ‘సూదిగాడు’ తాజాగా భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైల్లోకి ఎక్కి కలకలం రేపాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో రైలెక్కిన సూదిగాడు పలువురు ప్రయాణికులపై సిరింజీ దాడులు చేశాడు. దీంతో భీతిల్లిన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఆ తర్వాత కొందరు ప్రయాణికులు కాస్తంత ధైర్యం చేసి సూదిగాడిని ఒడిసిపట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న సైకో నుంచి పోలీసులు పెద్ద సంఖ్యలో సిరంజీలు, సూది మందును స్వాధీనం చేసుకున్నారు.