: ఈ నెల 30న రిటైర్ అవుతున్న కోదండరాం


తెలంగాణ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి... తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన యోధుడు ప్రొఫెసన్ కోదండరాం. టీజేఏసీ ఏర్పాటయ్యాకే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందన్న నిజాన్ని ఎవరూ కాదనలేరు. టీజేఏసీకి ఏర్పడ్డాక, దానికి అనుబంధంగా ఎన్నో జేఏసీలు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలోనే, ఉద్యమం మారుమూల గ్రామాలకు కూడా విస్తరించింది. చివరకు తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. అప్పటిదాకా అలుపెరగకుండా పోరాటం చేసిన కోదండరాం... తెలంగాణ ఏర్పడ్డాక, రాజకీయ రంగంలో అవకాశం ఉన్నప్పటికీ కాదనుకొని, తన వృత్తి అయిన విద్యాబోధన వైపు వెళ్లిపోయారు. అయితే, అప్పుడప్పుడూ ప్రజల పక్షాన తన గొంతుకను వినిపిస్తూనే ఉన్నారు. అలాంటి కోదండరాం ఈ నెల 30న ప్రొఫెసర్ గా రిటైర్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రిటైర్మెంట్ అనంతరం జేఏసీకి పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయిస్తానని చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News