: ఆర్టీసీని రక్షించాలంటే చార్జీలు పెంచక తప్పదు... ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సాంబశివరావు


నష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)ని రక్షించుకోవాలంటే ప్రయాణ చార్జీలను పెంచక తప్పదని ఆ సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు అన్నారు. ఈ మేరకు చార్జీలను ఎంతమేర పెంచాలన్న విషయంపై కసరత్తు చేస్తున్నామని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. చార్జీల పెంపు కోసం తాము రూపొందించిన నివేదికను ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి పంపామని ఆయన తెలిపారు. చార్జీల పెంపుపై సీఎం తీసుకునే నిర్ణయమే అంతిమమని కూడా ఆయన పేర్కొన్నారు. రెండేళ్లుగా ఆర్టీసీ చార్జీలను ఒక్క పైసా కూడా పెంచని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News