: మరింత విషమించిన చో రామస్వామి ఆరోగ్య పరిస్థితి
ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత చో రామస్వామి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని చెన్నైలోని అపోలో వైద్యులు ప్రకటించారు. తీవ్ర శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు గత రాత్రి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కొన్ని నెలల నుంచి చో ఆరోగ్య పరిస్థితి కీణిస్తూనే ఉంది. ఆగస్టులో చెన్నై వచ్చిన ప్రధాని మోదీ ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే. అప్పుడే సీఎం జయలలిత కూడా ఆయనను పరామర్శించారు.