: మోదీ సిలికాన్ వ్యాలీ సదస్సును ఆపండి...అమెరికా కోర్టులో సిక్కుల హక్కుల సంఘం పిటిషన్
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం అమెరికా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ మునుపటి మాదిరిగానే దూసుకెళుతున్నారు. ప్రపంచ దేశాధినేతలు, అమెరికా కార్పొరేట్ దిగ్గజాలతో వరుస భేటీలతో పాటు ఐరాస జనరల్ అసెంబ్లీలో చేసిన కీలక ప్రసంగాలతో ఆయన న్యూయార్క్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునే యత్నాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టిన యువ సంచలనం హార్దిక్ పటేల్ మోదీ పర్యటనను అడ్డుకోవాలని అమెరికాలోని తన సామాజికవర్గానికి పిలుపునిచ్చారు. తాజాగా సిక్కుల హక్కుల సంఘం కూడా మోదీ పర్యటనకు అడ్డు తగిలేందుకు రంగంలోకి దిగింది. భారత్ లో నరేంద్ర మోదీ సర్కారు మత మార్పిళ్లకు పాల్పడుతోందని ఆ సంస్థ ఆరోపించింది. ఈ కారణంగా రేపు సిలికాన్ వ్యాలీలో జరగనున్న మోదీ సదస్సును నిలిపేయాలని సిక్కుల హక్కుల సంఘం కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.