: వైట్ హౌస్ లో చైనా అధ్యక్షుడికి ఘన స్వాగతం...‘గన్ శాల్యూట్’తో ఆహ్వానం పలికిన ఒబామా


చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం అమెరికా వెళ్లిన జిన్ పింగ్ నిన్న ఆ దేశ అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా అధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. అమెరికా సైన్యం 21 సార్లు గాలిలోకి కాల్పులు జరిపి జిన్ పింగ్ కు ‘గన్ శాల్యూట్’ చేసింది. ప్రపంచ దేశాల్లో తన స్థాయికి ఎదిగిన దేశాధినేతలకు మాత్రమే వైట్ హౌస్ ఈ తరహా స్వాగతం పలుకుతుంది. నిన్నటి ‘గన్ శాల్యూట్’తో చైనా కూడా తమ దేశ స్థాయికి ఎదిగిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒప్పుకున్నట్టయింది.

  • Loading...

More Telugu News