: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంటిలో కేసీఆర్ బక్రీద్... విందుకు హాజరైన కవిత


ముస్లింల పండుగ బక్రీద్ సందర్భంగా నిన్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సలీం ఇంటికి వెళ్లారు. ఆయన ఏర్పాటు చేసిన బక్రీద్ విందులో కేసీఆర్ ఉల్లాసంగా గడిపారు. కేసీఆర్ తో పాటు ఆయన కేబినెట్ లోని డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు కూడా ఈ విందుకు హాజరయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో పాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జీహెచ్ ఎంసీ కమిషర్ సోమేశ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News