: మంగళగిరి గణనాథుడు కోటీశ్వరుడు!
గణనాథుని అలంకరణకు కొందరు పూలు ఉపయోగిస్తారు. మరికొందరు అందమైన చెమ్కీ దండలు వాడుతుంటారు. డబ్బులతో కూడా అలంకరిస్తూ ఉంటారు. అయితే, అది ఏదో కొద్ది మొత్తంలోనే ఉంటూ ఉంటాయి. కానీ, మంగళగిరిలో గణనాథుడు మాత్రం కోటీశ్వరుడు. ఎందుకంటే, ఇక్కడి గణనాథుడి విగ్రహాలంకరణకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం రూ. 10 నుంచి రూ.500, రూ.1000 నోట్ల వరకు అన్నీ ఉపయోగించారు. వీటి విలువ మొత్తం రూ. 1.3 కోట్లు. ఈ కరెన్సీ గణపతిని చూసేందుకు భక్తులు క్యూలు కడుతున్నారు.