: వారియర్స్ కు 'రాయల్ చాలెంజ్'
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్-6 టోర్నీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న జట్టు. పుణే వారియర్స్ ఇండియా.. పాపం ఇదీ రెండో స్థానంలోనే ఉంది, అయితే, చివరి నుంచి! ఇప్పుడీ రెండు జట్లు తలపడనున్నాయి. పోరుకు వేదిక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం. మరికాసేపట్లో మ్యాచ్ మొదలుకానుంది. టాస్ గెలిచిన పుణే వారియర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.