: విజయవాడ ‘నారాయణ’లో మరో విద్యార్థి ఆత్మహత్య
నారాయణ విద్యా సంస్థల్ మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయవాడలోని నిడమానూరు క్యాంపస్ లో చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అఖిల్ రెడ్డి కళాశాల భవనంపై నుంచి శుక్రవారం నాడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని కామినేని ఆస్పత్రికి తరలించారు. అఖిల్ రెడ్డి స్వస్థలం ఒంగోలు అని తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో కడప నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.