: సోమనాథ్ కు ఇద్దరు నేరగాళ్లు సాయం చేస్తున్నారు: ఢిల్లీ పోలీస్


ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఇద్దరు నేరగాళ్లు సాయం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. హర్యాణా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆ ఇద్దరికీ భయంకరమైన నేరచరిత్ర ఉందని వారు వెల్లడించారు. సోమనాథ్ భారతిని పోలీసుల బారినుంచి తప్పిస్తున్నది వారేనని వారు పేర్కొన్నారు. వారి గురించిన సమాచారం ఉందని తెలిపిన ఢిల్లీ పోలీసులు, త్వరలోనే వారిని పట్టుకుంటామని అన్నారు. కాగా, సోమనాథ్ భారతి భార్య ఆయనపై లిపికా మిత్రా హత్యయత్నం, గృహహింస కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కు ప్రయత్నించిన సోమనాథ్ భారతి, ప్రయత్నాలు విఫలం కావడంతో పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు.

  • Loading...

More Telugu News