: ఐఫోన్ కోసం క్యూలో నిలబడ్డ రోబో


ఒక రోబో క్యూలో నిలబడింది. ఎందుకంటే, దానికి ఐ ఫోన్ 6ఎస్ కావాలట. సిడ్నీలోని యాపిల్ స్టోర్ లో నిలబడిన వ్యక్తులతో పాటు అది కూడా క్యూ కట్టింది. క్యూలో వున్న వాళ్లలో ముగ్గురి తర్వాత ఈ రోబో నిలబడింది. ఆ రోబో పేరు లూసీ. దానికి అంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు, దానికి ఐ ఫోన్ తో పనేంటి? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తే... ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. ఆ వివరాలు..సిడ్నీలో నివాసం ఉండే లూసీ కెల్లీ ఒక సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు యాపిల్ కంపెనీ విడుదల చేయనున్న తాజా ఐ ఫోన్ 6ఎస్ పై కన్నుపడింది. ఎట్లా అయినా సరే, మార్కెట్ లో విడుదలైన రోజే ఆ ఫోన్ తన చేతిలో ఉండాలనుకుంది. అట్లా చేయాలంటే కనీసం కొన్ని గంటలపాటు యాపిల్ స్టోర్ ముందు క్యూలో నిలబడాల్సిందే. అందుకు ఆమెకు ఓపికా, సమయం రెండూ లేవు. పైగా తాను పనిచేసే సంస్థ బాస్ ను అడిగి సెలవు తీసుకోవాలి. ఇదంతా కుదరని వ్యవహారమనుకుంది. ఇదే విషయాన్ని బాస్ కు చెబితే, ‘నువ్వు క్యూలో నిలబడాల్సిన పని లేదు. మన రోబో ఉందిగా. దానిని నిలబెడదాము. ఆఫీసులో నీ పని నువ్వు చేసుకోవచ్చు.. నువ్వు కోరుకున్న రోజుకి ఆ ఫోన్ ని అందుకోవచ్చు’ అంటూ లూసీకి ఒక సలహా యిచ్చాడు ఆమె బాసు. అంతే, ఆ ఆలోచనను లూసీ ఆచరణలో పెట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తన గొంతు, ఫొటోను అమర్చిన ఆ రోబోకు తన పేరు పెట్టి క్యూలో నిలబెట్టింది అసలు లూసీ. తర్వాత అది పని చక్కబెట్టింది!

  • Loading...

More Telugu News