: రోడ్డుపై విమానం ల్యాండింగ్...బిత్తర పోయిన ప్రయాణికులు
ఏదైనా విమానానికి విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ విమానాశ్రయాధికారులను అనుమతి అడగడం, వారి అనుమతితో ల్యాండ్ చేయడం జరుగుతుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఓ విమానం నడి రోడ్డుపై దిగడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు బిత్తరపోయారు. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని కాలిఫోర్నియాలోని రెడ్ హిల్ ఎవెన్యూ ప్రాంతంలో స్థానిక ఆరెంజ్ కోస్ట్ ఫ్లైయింగ్ కి చెందిన పైపర్ షెరోకీ అనే తేలికపాటి విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిలైంది. దీంతో పైలట్ అప్రమత్తమై నడి రోడ్డుమీద చాకచక్యంగా ల్యాండ్ చేశాడు. విమానం నడి రోడ్డుపై దిగడాన్ని గమనించిన స్థానికులు బిత్తరపోయినా, తేరుకుని సెల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది. దీనిని గుర్తించిన అధికారులు, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.