: వాస్తవాధీన రేఖ వద్ద భారత్ గోడను నిర్మించాలనుకుంటోందంటూ... ఐరాసకు పాక్ ఫిర్యాదు
భారత్ పై సరిహద్దు దేశం పాకిస్థాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది. జమ్మూ కాశ్మీర్, పాక్ ల గుండా ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద... 197 కిలోమీటర్ల పొడవునా భారత్ పది మీటర్ల ఎత్తులో గోడను నిర్మించాలనుకుంటోందని ఫిర్యాదులో పేర్కొంది. పాక్ తరపున ఐక్యరాజ్యసమితి రాయబారిగా వ్యవహరిస్తున్న మలీహాలోధీ ఈ విషయమై ఐరాస భద్రతా మండలికి రెండు లేఖలు రాశారు. ఒకటి ఈ నెల 4వ తేదీన, మరొకటి 9వ తేదీల్లో రాసినట్టుగా తెలిసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని లేఖలో రాశారు. ఇది తెలిసిన భారత్ విషయాన్ని తీవ్రంగా తీసుకుంది. సరైన సమయంలో తగిన విధంగా స్పందిస్తామంటోంది.