: జగన్ నిరాహారదీక్ష వాయిదా


గుంటూరులో రేపు ప్రారంభం కావాల్సిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష వాయిదా పడింది. జగన్ దీక్షకు హైకోర్టు అనుమతి నిరాకరించడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు ఈ రోజు సమావేశమయ్యారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత జగన్ నిరాహార దీక్షకు సంబంధించిన తేదీ, వేదిక వివరాలను ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. గుంటూరులోని ఉల్ఫ్ హాల్ గ్రౌండ్స్ లో నిరాహారదీక్షకు వైఎస్ఆర్సీపి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News