: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త...14 వేల పోలీసు పోస్టుల భర్తీ: డీజీపీ రాముడు
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెబుతామని ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. కర్నూలు మహానంది ఆలయాన్ని సతీసమేతంగా సందర్శించి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీ పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నామని తెలిపారు. 12 వేల ఎస్సై, కానిస్టేబుల్, రెండు వేల డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో పోలీసుల హస్తముందని తేలితే కఠిన చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ర్యాంగింగ్ నిరోధక కమిటీల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన వివరించారు. త్వరలోనే విజయవాడ నుంచి పోలీసు శాఖ విధులు నిర్వర్తిస్తుందని ఆయన తెలిపారు.