: ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు


హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు బీచ్ లో గల్లంతైన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్ కు వెళ్లారు. అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ, ఆరుగురు విద్యార్థులు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News