: 28 ఉదయం పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం


భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ-30ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ లాంచింగ్ కు సంబంధించి రేపు ఉదయం 9 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. మొత్తం 49 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. ఈ ప్రయోగం ద్వారా ఆస్ట్రోశాట్ తో సహా 7 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. భారత్ కు చెందిన ఆస్ట్రోశాట్ బరువు 1513 కేజీలు. భారత్ నింగిలోకి పంపుతున్న తొలి స్పేస్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్. దీంతో పాటు ఇండొనేషియాకు చెందిన లపాన్-ఏ2 శాటిలైట్ (76 కేజీలు), కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్-14 (14 కేజీలు), అమెరికాకు చెందిన నాలుగు నానో శాటిలైట్లను కూడా పీఎస్ఎల్వీ సీ-30 నింగిలోకి తీసుకెళుతోంది.

  • Loading...

More Telugu News