: తలలోకి దూసుకెళ్లిన బాణం... అయినా మృత్యువును జయించాడు
రిత్విక్ అనే 11 ఏళ్ల బాలుడు మృత్యువును జయించాడు. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఉన్న ఆర్చరీ అకాడమీలో శిక్షణ జరుగుతున్న సమయంలో, పొరపాటున నో ఎంట్రీ జోన్ లోకి రిత్విక్ ప్రవేశించాడు. శిక్షణలో ఉన్న వారు రిత్విక్ ను గమనించకుండా, బాణాలను వదులుతున్నారు. ఈ సందర్భంలో, ఓ బాణం నేరుగా ఆ బాలుడి తలలో కుడివైపు నుంచి లోపలకు దూరి, ఎడమవైపు నుంచి బయటకు వచ్చింది. వెంటనే రిత్విక్ ను ఆసుపత్రికి తరలించారు. దాదాపు మూడు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు... రిత్విక్ తలలో ఉన్న బాణాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం రిత్విక్ ఆరోగ్య పరిస్థితి బాగుందని... భవిష్యత్తులో కూడా ఈ ప్రమాదం వల్ల ఎలాంటి సమస్యలు రావని వైద్యులు తెలిపారు.