: మరో ముగ్గురు ప్రవాస భారతీయులకు ఒబామా పెద్దపీట


మరో ముగ్గురు భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సలహాదారుల బృందంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రకటించింది. ప్రీతా బన్సాల్, నిపుణ్ మెహతా, జస్జీత్ సింగ్ లను ఒబామా తన సలహాదారులుగా నియమించుకున్నారని, వీరితో పాటు మరో 14 మంది ఒబామా టీంలో చేరారని వైట్ హౌస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రీతా ప్రస్తుతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్చరర్ గా పనిచేస్తూ, సోషల్ ఎమర్జన్స్ కార్పొరేషన్ పేరిట ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ను నిర్వహిస్తున్నారు. గతంలో యూఎస్ సుప్రీంకోర్టులో లా క్లర్క్ గా కూడా పనిచేశారు. నిపుణ్ మెహతా, సన్ మైక్రోసిస్టమ్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా కెరీర్ ను ప్రారంభించి, సర్వీస్ స్పేర్ పేరిట ఓ సంస్థను 1999లో మొదలు పెట్టారు. అడ్వయిజరీ సర్కిల్, సేవా ఫౌండేషన్, దలైలామా ఫౌండేషన్ తదితర ఎన్నో కౌన్సిళ్లకు సలహాదారుగా ఉన్నారు. ఆయనందించిన సేవలకు గుర్తింపుగా యూఎస్ అధ్యక్షుడి నుంచి వాలంటరీ సర్వీస్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక జస్జీత్ సింగ్ విషయానికి వస్తే, సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ ఈడీగా పనిచేస్తున్నారు. అంతకుముందు డెల్లాయిట్ వంటి ఐటీ సంస్థల్లో సేవలందించారు.

  • Loading...

More Telugu News