: మరో ముగ్గురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు కడప స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హసన్ భాయ్, నఫీస్ హుస్సేన్, అశోక్ కుమార్ అగర్వాల్ అనే ఎర్రచందనం స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 కోట్లు విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, జైపూర్, కాన్పూర్ లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ స్మగ్లర్లు చిక్కారు. వెంటనే వారిని కడప తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఢిల్లీ, జైపూర్ లో 3 గోదాములు జప్తు చేశామని చెప్పిన పోలీసులు, నిందితులు దుబాయ్ కు చెందిన అలీభాయ్ అనుచరులని ధ్రువీకరించారు.