: ఒక్క ఛాన్స్ కోసం... దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంటి ముందు యువతి పడిగాపులు!


సినిమాల్లో నటించాలనుకున్నవారు మొదట్లో చిన్న చిన్న పాత్రలతో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఓ యవతి మాత్రం సినిమాల పిచ్చితో దర్శకుడి ఇంటిముందు గంటల తరబడి వేచి చూసి పలువురిని కంగారుపెట్టింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఆ యువతి నర్సంపేటలోని డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు సినిమాల్లో నటించాలన్న పిచ్చితో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే అభిమానం. ఇంకేముంది, ఇంట్లో చెప్పకుండా రెండు రోజుల కిందట సాయంత్రం వరంగల్ నుంచి హైదరాబాదులోని ఫిలింగనర్ కు వచ్చేసింది. అర్ధరాత్రి 11.30 సమయంలో రోడ్డు పక్కన ఒంటరిగా ఉన్న యువతిని గమనించిన ఓ టాక్సీ డ్రైవర్ వివరాలు అడిగాడు. తాను పూరి ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఒంటిగంట సమయంలో టాక్సిలో ఆమెను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 31లో ఉన్న పూరి ఇంటి ముందు దింపి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తెల్లవారే దాకా యువతి పూరి కోసం అక్కడే ఎదురుచూస్తోంది. కనిపిస్తే ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలని అడగాలనుకుంది. అలా తెల్లవారే వరకు పడిగాపులుగాసింది. ఇంతలో ఆమెను గమనించిన సెక్యూరిటీ గార్డులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువతిని తమ వెంట తీసుకువెళ్లి వివరాలడిగారు. యువతి తండ్రి హనుమాన్ సింగ్ ను పిలిపించి అసలు విషయం చెప్పి, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి పంపారు.

  • Loading...

More Telugu News