: టాప్-25 యాప్స్ పై మల్ వేర్ దాడులు, వేలు పెడితే 'సెల్లు' కొల్లేరే!


యాపిల్ స్టోర్ల నుంచి లభిస్తున్న టాప్-25 యాప్స్ పై సైబర్ దాడులు జరుగుతున్నాయని, వీటి కారణంగా యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యాపిల్ ఐఎన్సీ వెల్లడించింది. తమ స్టోర్లో లభించే వీచాట్, డిడి టాక్సీ వంటి ఎన్నో యాప్స్ పై మల్ వేర్ ప్రభావం ఉందని 'ఎక్స్ కోడ్ ఘోస్ట్' పేరిట ఈ సైబర్ దాడి చైనీస్ యాప్స్ నుంచి జరుగుతోందని యాపిల్ తెలిపింది. వీటిని తాకితే, ఫోన్లో వైరస్ చేరిపోయి డేటా తుడిచి పెట్టుకుపోతోందని వివరించింది. సమస్యను పరిష్కరించి యాప్స్ సెక్యూరిటీని మరింతగా పెంచే పనిలో ఉన్నామని, కస్టమర్లు కొంతకాలం పాటు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. యాప్ స్టోర్ లో అందుబాటులో ఉన్న 4 వేలకు పైగా అప్లికేషన్స్ వైరస్ కారణంగా తప్పుడు ఫలితాలు చూపుతున్నాయని వీటిల్లో అత్యధిక యూజర్ల ఆదరణ ఉన్నవి కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది.

  • Loading...

More Telugu News