: బంపర్ ఆఫర్... కేవలం ఒక్కరోజు తాజ్ మహల్ ఉచిత సందర్శన
ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం తాజ్ మహల్ ను ఒకరోజు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ బంపర్ ఆఫర్ ఇస్తోంది. తాజ్ మహల్ తో పాటు 200 పర్యాటక ప్రదేశాలు, మ్యూజియంలను కూడా ఉచితంగా చూడవచ్చని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రదేశాలు, తాజ్ మహల్, ఆగ్రా ఫ్రంట్, హంపి, గోల్కొండ, చార్మినార్ సహా ఇతర మ్యూజియంలను ఆ రోజు సందర్శకులు ఉచితంగా వీక్షించవచ్చు. కేవలం ఆ ఒక్కరోజే ఈ ప్రాంతాల్లో ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు.