: వాళ్లను ముందు 'కాశ్మీర్' అననివ్వండి... అప్పుడు చూద్దాం!


ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భాగంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీరు అంశాన్ని లేవనెత్తితే, అందుకు తగ్గ సమాధానం వెంటనే చెబుతామని ఇండియా స్పష్టం చేసింది. "ఆయన ఏదైనా ఒక్క మాట కాశ్మీరు గురించి మాట్లాడినా, మేము సమాధానం ఇస్తాం" అని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. కాగా, ఐరాసలో కాశ్మీరు అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఇండియాను ఇరుకున పెట్టాలని పాక్ ప్రధాని భావిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 30వ తేదీన ఐరాస సర్వసభ్య సమావేశంలో షరీఫ్ ప్రసంగించనున్నారు. గత సంవత్సరం ఇవే సమావేశాల్లో కాశ్మీర్ అంశాన్ని షరీఫ్ లేవనెత్తగా ప్రధాని మోదీ ఘాటుగానే స్పందించిన సంగతి గుర్తుండే వుంటుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యను ప్రపంచ సమస్యగా చూపడాన్ని ఆయన తప్పుబట్టారు. సరిహద్దుల్లో పాక్ నిర్వాకాల వల్లే ఈ స్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News