: వేషాలు మార్చి దాడులు మొదలు పెట్టిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
నిన్నటి వరకూ కిడ్నాపులు, గొంతులు కోయడం, బాంబు దాడులు, భవనాలపై నుంచి కింద పడేయడం, సజీవ దహనాలు వంటి వికృత చర్యలతో ప్రపంచానికి సవాళ్లు విసిరిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ దాడుల పంథాను మార్చారు. యమన్ లో హౌతీ గ్రూప్ నిర్వహిస్తున్న ఓ మసీదుపై వినూత్న రీతిలో దాడి చేశారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడికి మహిళ వేషం వేయించి, ఒంటి నిండా బాంబులు అమర్చి పంపారు. బక్రీదు పర్వదినం సందర్భంగా మసీదులో పెద్ద ఎత్తున ప్రార్థనలు జరుగుతున్న వేళ ఈ దాడి జరుగగా, 10 మందికి పైగా మరణించారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఇలా వేషం మార్చి ఆత్మాహుతిదాడి చేయడం ఇదే మొదటిసారని తెలుస్తోంది.