: పటేళ్లకు రిజర్వేషన్లు ఇవ్వలేం కానీ...!
గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లలో స్థానం కల్పించలేమని స్పష్టం చేసిన ఆనందీ బెన్ పటేల్, ఇదే సమయంలో వారి సంక్షేమం కోసం రూ. 1000 కోట్ల భారీ ప్యాకేజీని ఇవ్వనున్నట్టు తెలిపారు. పటేల్ కమ్యూనిటీ యువకులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సహకరిస్తామని, ఇతర సౌకర్యాలకు ఈ నిధులను వాడుతామని ఆమె స్పష్టం చేశారు. పటేళ్లు చేస్తున్న ఆందోళనలను విరమించాలని ఆమె కోరారు. కాగా, ఈ ప్యాకేజీ ఓ లాలీపాప్ వంటిదని యువనేత హార్దిక్ పటేల్ ఎద్దేవా చేశారు. ఇటువంటి తాత్కాలిక ప్యాకేజీలు తమకు అవసరం లేదని తెలిపారు. తమ ఏకైక లక్ష్యం రిజర్వేషన్లు మాత్రమేనని వివరించారు.